Facebook: జులై లో రానున్న ఫేస్ బుక్ స్మార్ట్ స్పీకర్ లు!

  • 15 అంగుళాల టచ్ స్క్రీన్ తో స్మార్ట్ స్పీకర్లు: డిజిటైమ్ రిపోర్టు
  • వాయిస్ కమాండ్స్ తోపాటు ఫేస్ రికగ్నైజ్ తో కూడిన టెక్నాలజీ
  • ఎలాంటి అధికారిక ప్రకటన చేయని ఫేస్ బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అలోహ, ఫియోనా పేరిట రెండు స్మార్ట్ స్పీకర్లను రూపొందిస్తున్నట్లు డిజిటైమ్ రిపోర్టు తెలిపింది. ఈ స్మార్ట్ స్పీకర్లు 15 అంగుళాల టచ్ స్క్రీన్ తో ఉంటుందని పేర్కొంది. వాయిస్ కమాండ్స్ తోపాటు ఫేస్ రికగ్నైజ్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ స్పీకర్లు రానున్నాయి. ఈ ఏడాది జూలైలో ఈ డివైజ్ లను రిలీజ్ చేయనున్నట్లు డిజిటైమ్ రిపోర్టు తెలిపింది. కాగా, ఈ డివైజ్ లపై వస్తున్న వార్తలపై ఫేస్ బుక్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే దీనికి సంబంధించిన ఫొటోలను సంస్థ విడుదల చేయలేదు.

More Telugu News