AIUDF: 'మీకు రాజకీయాలెందుకు?'...ఆర్మీ చీఫ్‌కు ఒవైసీ చురక

  • ఆర్మీ చీఫ్‌కు రాజకీయాల్లో జోక్యం తగదని చురక
  • పార్టీలకు రాజ్యాంగం అనుమతి ఉందని వెల్లడి
  • ఆర్మీ చీఫ్ పౌర నాయకత్వం కిందే పనిచేయాలని హితవు

అసోంలో మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ నేతృత్వంలోని ఏఐయూడీఎఫ్ (ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్) అభివృద్ధిపై మాట్లాడిన ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌‌పై మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆర్మీ చీఫ్‌ రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోరాదని హితవు పలికారు. ఓ రాజకీయ పార్టీ అభివృద్ధిపై కామెంట్ చేయడం ఆర్మీ చీఫ్ పనికాదని ఆయన స్పష్టం చేశారు.

పార్టీలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం నుంచి అనుమతి ఉందని, ఆర్మీ చీఫ్ ఎల్లప్పుడూ ఎన్నికైన పౌర నాయకత్వం కిందే పనిచేయాలని ఒవైసీ సూచించారు. అసోంలోని పలు జిల్లాల్లో ముస్లిం జనాభా పెరుగుదలపై వచ్చిన నివేదికల నేపథ్యంలో బిపిన్ బుధవారం మాట్లాడుతూ...1980ల్లో బీజేపీ వృద్ధి కంటే ఏఐయూడీఎఫ్ వేగంగా వృద్ధి చెందిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈశాన్య భారతంలో సరిహద్దుల రక్షణపై ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News