varun tej: వరుణ్ తేజ్ తదుపరి చిత్రంలో డ్యూయెట్స్ కి చోటులేదు!

  • సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 
  • ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • వ్యోమగామి పాత్ర కోసం వరుణ్ కి శిక్షణ

విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వరుణ్ తేజ్ ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకి 'ఫిదా' .. 'తొలిప్రేమ' వంటి హిట్స్ దక్కాయి. ఆయన తదుపరి చిత్రం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

అంతరిక్షం నేపథ్యంలో కొనసాగనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ 'వ్యోమగామి'గా కనిపించనున్నాడు. ఏప్రిల్ నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో డ్యూయెట్స్ ఉండవట. సందర్భాన్ని బట్టి ఒకటి రెండు పాటలు మాత్రం బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తాయట, అంతే. అంతరిక్ష వ్యోమగామిగా కనిపించనున్న వరుణ్ తేజ్, ఈ లోగా పాత్రపరంగా శిక్షణ తీసుకుంటాడని అంటున్నారు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో విడుదల చేయనున్నట్టు సమాచారం.        

More Telugu News