chiranjeevi: 'సైరా' రెండవ షెడ్యూల్ అందుకే మొదలుకాలేదట!

  • 'సైరా' తాజా షెడ్యూల్ కి సన్నాహాలు 
  • బరువు తగ్గుతోన్న చిరంజీవి 
  • ఈ కారణంగానే ఆలస్యం

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతోంది. చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ ఈ నెలలో మొదలవుతుందని ఇంతకుముందే చెప్పారు. కానీ వచ్చే నెలలో మొదలు కానుందనేది తాజా సమాచారం. షూటింగ్ విషయంలో ఇలా ఆలస్యం కావడానికి గల కారణం, చిరంజీవి కొత్త లుక్ కోసమేనని అంటున్నారు.

ఈ షెడ్యూల్లో నరసింహా రెడ్డి యంగ్ లుక్ తో చిరంజీవి కనిపించనున్నారు. అందుకోసం ఆయన క్లీన్ షేవ్ లో స్లిమ్ గా ఫిట్ నెస్ తో కనిపించవలసి వుంటుందట. బరువు తగ్గడానికి కసరత్తు చేయడంలో చిరంజీవి నిమగ్నమై ఉన్నారట. ఈ నెల చివరిలో లుక్ ఓకే చేసుకుని, వచ్చేనెలలో రెండవ షెడ్యూల్ ను మొదలుపెడతారని సమాచారం. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, ఒక కీలకమైన పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు.   

More Telugu News