GHMC: బీఎస్ఈలో గ్రేటర్ హైదరాబాద్ బాండ్లు... ట్రేడింగ్ చేసిన కేటీఆర్

  • గతంలో రూ. 200 కోట్లను సేకరించిన జీహెచ్ఎంసీ
  • ఎస్ఆర్డీపీలో భాగంగా సేకరణ
  • మొత్తం లక్ష్యం రూ. 1000 కోట్లు

ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్ లో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) బాండ్లు ఈ ఉదయం నుంచి లిస్టింగ్ అయ్యాయి. తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు తొలి ట్రేడింగ్ చేసి, లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు. గతంలో మునిసిపల్ బాండ్లను విక్రయించడం ద్వారా జీహెచ్ఎంసీ 200 కోట్ల రూపాయల నిధులను సేకరించిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్డీపీ (స్ట్రయిట్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్) లో భాగంగా ఈ నిధుల సమీకరణ జరిగింది. మొత్తం రూ. 1000 కోట్లను 8.9 శాతం వడ్డీ రేటుపై సేకరించాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యం.

More Telugu News