Rohit Vemula: రెండేళ్ల తర్వాత యూనివర్సిటీ నుంచి రూ.8 లక్షల పరిహారం అందుకున్న రోహిత్ వేముల తల్లి

  • రోహిత్ మృతికి పరిహారంగా రూ.8 లక్షల పరిహారం అందించిన వర్సిటీ
  • తొలుత నిరాకరించిన రోహిత్ తల్లి రాధిక
  • పరిహారం అందుకున్నా రోహిత్ మరణానికి కారణమైన వారిపై పోరాటం ఆగదని హెచ్చరిక

హెచ్‌సీయూ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల చనిపోయిన రెండేళ్ల తర్వాత అతడి తల్లి రాధిక వేముల యూనివర్సిటీ పరిహారాన్ని స్వీకరించేందుకు అంగీకరించారు. రోహిత్ మరణానంతరం అతడి కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం అందించేందుకు వర్సిటీ ముందుకు వచ్చినా తొలుత ఆమె స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ కేసులో తాను నోరు మెదపకుండా ఉండేందుకే ఆ సొమ్ము ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అయితే, తాజాగా ఆమె ఆ సొమ్మును స్వీకరించారు. ఆ సొమ్మును రెండు నెలల వయసున్న తన మనవడు (ఇతనికి రోహిత్ వేముల పేరు పెట్టారు) చదువు కోసం ఖర్చు చేస్తానని తెలిపారు. అయితే పరిహారం అంగీకరించినంత మాత్రాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ చాన్స్‌లర్ అప్పారావు, కేంద్ర మాజీ మంత్రులపై  పోరాటం ఆగదని, వారికి శిక్షపడే వరకు విశ్రమించనని రాధిక హెచ్చరించారు.
 

More Telugu News