Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • కాజల్ ఇంట్లో కొత్త సందడి!
  • పాట పాడుతున్న యంగ్ హీరో 
  • తాప్సీతో కలసిన మరో హీరోయిన్!
  • గోపీచంద్ సినిమాలో హంసానందిని  

*  అందాల కాజల్ అగర్వాల్ ఇంట్లో ఆనందంతో కూడిన సందడి నెలకొంది. కారణం, ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ కు పండంటి బాబు పుట్టాడు. ఈ విషయం గురించే చెబుతూ, బాబుని ముద్దాడుతున్న ఫొటోను కాజల్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
*  ఆమధ్య 'నక్షత్రం' చిత్రంలో నటించిన యంగ్ హీరో తనీష్ తాజాగా 'దేశ దిమ్మరి' చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకో విశేషం ఏమిటంటే, ఈ చిత్రంలో తనీష్ ఒక పాటను కూడా పాడాడట. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
*  తాప్సీ, కీర్తి సనన్ కలసి ఓ హిందీ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా పేరు 'ఉమేనియా'. ఇందులో వీరిద్దరూ ప్రొఫెషనల్ షూటర్స్ గా నటిస్తున్నారని, దీంతో ఇద్దరికీ ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని తెలుస్తోంది.
*  స్పెషల్ సాంగుల స్పెషలిస్టు హంసానందిని తాజాగా గోపీచంద్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తోంది. గోపీచంద్ నటిస్తున్న 'పంతం' చిత్రంలో ఈ ముద్దుగుమ్మ ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తోందట.

More Telugu News