Pawan Kalyan: అంబటి రాంబాబు గారూ! రాజ్యాంగం గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించలేదు: ‘జనసేన’ విద్యార్థి విభాగం

  • ‘అవిశ్వాసం’పై పవన్ చెప్పింది తప్పన్న అంబటి వ్యాఖ్యలపై ‘జనసేన’ విద్యార్థి విభాగం కౌంటర్
  • రాజ్యాంగం గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావించలేదు
  • పవన్ ప్రెస్ మీట్ వీడియోను మరోసారి చూడండంటూ అంబటికి సూచించిన విద్యార్థి విభాగం

మీడియా ఎదుట వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిన్న చేసిన వ్యాఖ్యలపై జనసేన విద్యార్థి విభాగం భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘అవిశ్వాసం పెట్టడానికి సంబంధించి మొన్న పవన్ కల్యాణ్ చెప్పింది తప్పు. రూల్ పొజిషన్ చూసుకోవాల్సిందిగా చెబుతున్నాం. ‘అవిశ్వాసం’ అనే మాట రాజ్యాంగంలో లేదు. అది పార్లమెంటరీ ప్రొసీజర్ లో ఒక భాగం. పార్లమెంటరీ ప్రొసీజర్ లోని మోషన్స్ లో అంటే తీర్మానాల్లో ఉంటుంది’ అని అంబటి రాంబాబు చెప్పారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అసలు, రాజ్యాంగం గురించిన ప్రస్తావన పవన్ కల్యాణ్ చేయలేదని, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడారని మీకు ఎవరు చెప్పారంటూ అంబటిని ప్రశ్నించారు.

‘లోక్ సభ ప్రొసీజర్స్ అండ్ గైడ్ లైన్స్’ అని మాత్రమే ఆరోజున పవన్ అన్నారని ఆ ప్రకటనలో గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ కు సంబంధించిన వీడియోను అంబటి రాంబాబు మరోమారు చూడాలని, అదేవిధంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వివరణాత్మక సమాచారంతో కూడిన వీడియో లింక్ ని  కూడా జతపరుస్తున్నామని, ఆ లింక్ ను కూడా ఓసారి అంబటి చూడాలంటూ ఆ ప్రకటనలో భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేర్కొంది.

More Telugu News