Yuzvendra Chahal: చాహల్ కళ్లద్దాల వెనుక కథ..!

  • వైద్యుల సూచన మేరకే కళ్లద్దాల ధరింపు
  • త్వరలో ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్‌పెక్టర్‌ ఉద్యోగంలో చేరిక
  • మైదానంలో చాహల్ కళ్లద్దాల ధరింపుపై అతని తండ్రి వివరణ

దక్షిణాఫ్రికా టూర్‌లో టీమిండియా సాధిస్తున్న విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పిన్నర్ చాహల్ మైదానంలో ఫీల్డింగ్ చేసేటప్పుడు కళ్లజోడు ధరించడం వెనుక ఉన్న కారణాన్ని అతని తండ్రి వివరించాడు. తన కుమారుడు ఇన్‌కమ్‌టాక్స్ ఇన్స్‌పెక్టర్‌ పోస్టుకు ఎంపికయ్యాడని, టూర్ నుంచి తిరిగి రాగానే న్యూఢిల్లీలో అతను ఉద్యోగంలో చేరుతాడని ఆయన తెలిపారు. అసలు దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లడానికి ముందే అప్పుడప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవాలని కంటి వైద్య నిపుణుడు ఒకరు తన కుమారుడికి సూచించారని ఆయన చెప్పారు.

చాహల్ బౌలింగ్, బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్లద్దాలు పెట్టుకోవడం లేదని, అతని కంటిచూపు మందగించలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వోద్యోగానికి ఎంపికైనప్పుడు వైద్య పరీక్షల సందర్భంగా చాహల్‌ను కళ్లద్దాలు వాడమని సూచించారని ఆయన తెలిపారు. టీమిండియా ప్లేయర్లలో చాహల్ ఒక్కడే మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కళ్లద్దాలు ధరిస్తున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ కూడా కళ్లద్దాలు పెట్టుకుంటారు. కానీ, అది ఆడేటపుడు మాత్రం కాదు. న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ డేనియల్ వెట్టోరి మాత్రం ఎల్లప్పుడూ కళ్లద్దాలు పెట్టుకునే ఆడేవాడు.

More Telugu News