India: నేనేమైనా షేక్ హ్యాండ్స్ కోసం ఇక్కడికి వచ్చానా?: కెనడా ప్రధాని ట్రూడో

  • వారం రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు ట్రూడో
  • ఇంతవరకూ ట్రూడోను కలవని ప్రధాని నరేంద్ర మోదీ
  • ప్రజలను కలిసి మాట్లాడేందుకే వచ్చానన్న కెనడా ప్రధాని

వారం రోజుల పర్యటన నిమిత్తం ఇండియాకు కుటుంబ సమేతంగా వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేడు ముంబైలో పర్యటిస్తున్న వేళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశాధినేతైనా ఇండియాకు వస్తే ఆయనకు స్వయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదల ఏర్పాట్లు పర్యవేక్షించే ప్రధాని నరేంద్ర మోదీ, ఇంతవరకూ ట్రూడోను కలవలేదని విమర్శలు వస్తున్న వేళ, ట్రూడో మాట్లాడుతూ, తాను రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజలను కలిసి వారితో నేరుగా మాట్లాడేందుకు వచ్చానే తప్ప షేక్ హ్యాండ్లు, ఫోటోల కోసం కాదని అన్నారు.

వ్యాపారం, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఇక్కడి ప్రజలకు కెనడా ఎంతో దగ్గరైందని, ప్రతి సంవత్సరమూ 1.2 లక్షల మంది విద్యార్థులు తమ దేశానికి విద్యాభ్యాసం నిమిత్తం వస్తుంటారని చెప్పారు. కాగా, ట్రూడోను షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో పాటు ఐసీఐసీఐ ఎండీ చందకొచ్చర్ కూడా కలిశారు.

More Telugu News