M Karunanidhi: కమల్ కొత్త పార్టీ గురించి స్టాలిన్ ఏమన్నారో తెలుసా?

  • డీఎంకే బలమైన వేళ్లున్న మర్రి చెట్టు లాంటిది
  • కొత్త పార్టీలు సువాసన లేని కాగితపు పూలు
  • అవన్నీ త్వరలోనే కనుమరుగవుతాయని ఎద్దేవా

కమలహాసన్ రేపు మధురైలో తన కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయనపై అప్పుడే రాజకీయ పరమైన విమర్శలు మొదలైపోయాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మంగళవారం కమల్ ప్రకటించబోయే పార్టీపై పలు వ్యాఖ్యలు చేశారు. "కాగితపు పూలకు గుబాళింపు ఉండదు. అవి ఓ సీజన్‌లో వికసిస్తాయి. త్వరగానే అవి కనుమరుగైపోతాయి" అంటూ కమల్ పార్టీ ఎక్కువ కాలం నిలిచేది కాదంటూ ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా స్టాలిన్ తన పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ కూడా రాశారు.

"డీఎంకే మర్రిచెట్టు లాంటిది. దానికి బలమైన వేళ్లు, కొమ్మలు ఉన్నాయి. అది ఎవరి వల్లా కూడా చలించదు. (కొత్త) పార్టీలు ఓ సీజన్‌లో వస్తాయి. కానీ అవి సువాసన లేని కాగితపు పూల లాంటివి. అవి త్వరగానే కనుమరుగైపోతాయి" అనేది అందులోని సారాంశం. కాగా, కమల్ ఆదివారం నాడు చెన్నైలోని గోపాలపురంలో ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధిని ఆయన ఇంట్లో కలిసి, ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. కమల్ తన రాజకీయ ప్రయాణాన్ని రేపు ఉదయం రామేశ్వరం నుంచి మొదలుపెడుతారు. సాయంత్రం మధురైలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరును ప్రకటిస్తారు.

More Telugu News