cyber crime police: సైబర్ క్రైమ్ షార్ట్ ఫిలిం: అబ్బాయిలకు వలవేసే కి'లేడీ'ల పట్ల జాగ్రత్తగా ఉండమంటున్న 'అర్జున్ రెడ్డి'!

  • ప్రేమ, పెళ్లి పేరుతో నిలువుదోపిడీ చేసే సైబర్ క్రైమ్  కీ‘లేడీ’లకు చెక్ చెప్పేందుకు లఘు చిత్రం
  • విజయ్ దేవరకొండతో షార్ట్ ఫిల్మ్ సందేశం తయారు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ లఘు చిత్రం

మ్యాట్రిమొని సైట్లు లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు చెక్ చెప్పేందుకు హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీసులు అర్జున్ రెడ్డి ఉరఫ్ దేవరకొండ విజయ్ సహాయం తీసుకున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో నిలువు దోపిడీ చేసే సైబర్ క్రైమ్ కి‘లేడీ’ల పట్ల అవగాహన కల్పించేందుకు ‘సైబర్ క్రైమ్’ విభాగం షార్ట్ ఫిల్మ్ తయారు చేసింది.

అందులో చివర్లో కనిపించే విజయ్ దేవరకొండ... "మ్యాట్రిమొనియల్ సైట్‌‌ లో పరిచయం, ఫేస్‌ బుక్‌ లో మీటింగ్స్, స్కైప్‌ లో ఎంగేజ్మెంట్. సరికాదు.... ఒక్క షర్టు కొనాలంటే ఆ షర్ట్ బ్రాండేంటి? క్వాలిటీ ఏంటి? రేటెంత? అని వందశాతం ఆలోచించే మనం.. పెళ్లి దగ్గరికొచ్చేసరికి ఎందుకంత అజాగ్రత్త? అమ్మాయి లేదా అబ్బాయి ప్రొఫైల్ చూసినప్పుడు వారి జీతమెంత? అందంగా ఉందా? అని కక్కుర్తి పడకండి. అసలు వాళ్లు నిజంగా ఉన్నారా? లేరా? ఆ ప్రొఫైల్ వాస్తవమా?, కాదా? తెలుసుకోండి, ఆరా తీయండి. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి" అంటూ సందేశమిచ్చాడు. ఇది సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 

More Telugu News