Kamal Haasan: మధురైలో రేపే కమలహాసన్ పార్టీ ప్రకటన... పేరు, విధానాలపై అంతటా ఆసక్తి

  • రేపు సాయంత్రం మధురైలో బహిరంగ సభ
  • అక్కడే పార్టీ ప్రకటన, జెండా, విధానాల ఆవిష్కరణ
  • అన్నాడీఎంకే చెత్తగా మారిపోవడం వల్లే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన

విఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ అరంగేట్రం రేపే జరగనుంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఆయన గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, విధానాలను వెల్లడించేందుకు ముహూర్తం ఖరారైంది. మధురైలో రేపు సాయంత్రం 6 గంటలకు జరిగే భారీ బహిరంగ సభే ఇందుకు వేదిక. పార్టీ పేరును ప్రకటించి జెండాను కూడా కమల్ ఆవిష్కరించనున్నారు.

ఈ సభకు హాజరు కావాలని ఆయన ప్రజల్ని కోరారు. పార్టీ ప్రకటనకు ముందు కమల్ మరో అగ్రనటుడు రజనీకాంత్, విజయకాంత్, డీఎంకే అధినేత కరుణానిధిలను ఇటీవలే మర్యాదపూర్వకంగా కలుసుకున్న విషయం తెలిసిందే. కాగా, అన్నాడీఎంకే పార్టీ చెత్తగా మారిపోడం వల్లే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు కమల్ తాజాగా వ్యాఖ్యానించారు. మరోవైపు కమల్ ప్రకటించే పార్టీ పేరు, జెండా పట్ల ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News