Idea cellular: ఇప్పుడు ఐడియా వంతు... రూ.109కే ఉచిత కాల్స్, డేటా

  • కేవలం 14 రోజులు మాత్రమే వ్యాలిడిటీ
  • రోజులో 250 నిమిషాలు, వారంలో 1,000 నిమిషాలే ఉచితం
  • ఎయిర్ టెల్, జియోలో రూ.93కే అధిక ప్రయోజనాలు

టెలికం కంపెనీల మధ్య ధరల పోరు కొనసాగుతోంది. జియో, ఎయిర్ టెల్ నెలంతా ఉచిత డేటా, కాల్స్ తో కూడిన ప్లాన్లను రూ.100లోపే ప్రవేశపెట్టడంతో, ఐడియా కూడా ఈ తరహాలోనే రూ.109 పథకాన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ లో అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ పొందొచ్చు. దీనికి తోడు ప్రతిరోజూ 1జీబీ 4జీ/3జీ డేటాను, 100 ఎస్ఎంఎస్ లను పొందొచ్చు. కాకపోతే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులే. పైగా రోజులో 250 నిమిషాలే ఉచితం. వారంలో 1,000 నిమిషాలే ఉచితంగా మాట్లాడుకోగలరు. పరిమితి దాటిన తర్వాత ప్రతీ సెకనుకు ఒక పైసా చార్జీ పడుతుంది.

 ఎంపిక చేసిన సర్కిళ్లలో యూజర్లు ఐడియా వెబ్ సైట్, మై ఐడియా యాప్ ద్వారా రీచార్జ్ చేసుకుని ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఎయిర్ టెల్ ఇటీవలే రూ.93 ప్లాన్ ను ప్రకటించింది. ఇందులో 28 రోజుల వరకు అపరిమిత కాలింగ్ తోపాటు 1జీబీ డేటా సదుపాయం ఉంది. ఇదే ధరకు జియో 2జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అవకాశం కల్పిస్తోంది. ఈ దృష్ట్యా పోటీ కంపెనీలతో పోలిస్తే ఐడియా ప్లాన్ ఏ మాత్రం ఆకర్షణీయంగా కనిపించడం లేదు. 

More Telugu News