Cricket: భువనేశ్వర్ ను ఎదుర్కొనే ఉపాయం ఇదే: గ్రేమ్ స్మిత్

  • భువీ బౌలింగ్ అద్భుతం
  • తొలి టీ20 వీడియోలు చూడండి
  • భువీ బౌలింగ్ శైలిని, బంతులేసే ఏరియాలను పరిశీలించండి

తొలి టీ20లో పదునైన బంతులతో చెలరేగిన టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఎదుర్కొనేందుకు సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉపాయం చెప్పాడు. మాజీ ఆటగాడిగా కంటే కామెంటేటర్‌ గా భువీ బౌలింగ్‌ ను ఎక్కువ ఆస్వాదించానని పేర్కొన్న స్మిత్, భువీ బౌలింగ్ స్కిల్స్ ప్రొటీస్ బౌలర్ల కంటే మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించాడు. భువనేశ్వర్‌ ను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించాడు.

భువీ లెగ్ కట్టర్స్, నకుల్‌ బాల్‌, స్వింగ్ ను అత్యద్భుతంగా సంధిస్తున్నాడని అన్నాడు. భువీ బౌలింగ్ ను ఎదుర్కొనేందుకు ప్రాక్టీస్ ఒక్కటే మార్గమని తెలిపాడు. తొలి టీ20 వీడియోలు చూడాలని సఫారీ బ్యాట్స్ మన్ కు సూచించాడు. భువనేశ్వర్ ఎలాంటి బంతులు సంధిస్తున్నాడో పరిశీలించాలని చెప్పాడు. దీంతో తరువాత భువీని ఎలా ఎదుర్కోవాలో అర్థమవుతుందని చెప్పాడు. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ తో ఆకట్టుకుంటుంటే, సఫారీలు అన్ని విభాగాల్లో సమష్టి వైఫల్యం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

More Telugu News