raghu veera reddy: అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ సమ్మతించారు: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

  • అవిశ్వాస తీర్మానంపై రాహుల్ తో ఇప్పటికే మాట్లాడాను
  • మాకు ఎవరి మద్దతు అక్కర్లేదు
  • మాతో ఉన్న పద్నాలుగు పార్టీల సభ్యులు సరిపోతారు 

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందంటూ వస్తున్న వార్తలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, రాహుల్ తో ఇప్పటికే మాట్లాడానని చెప్పారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ సమ్మతించారని, తమకు ఎవరి మద్దతు అక్కర్లేదని, తమతో ఉన్న పద్నాలుగు పార్టీల సభ్యులు సరిపోతారని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కాంగ్రెస్ లోక్ సభా పక్ష నేత ఖర్గేకు రాహుల్ గాంధీ తగిన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. విభజన చట్టంలో లోపాలుంటే సవరించాలని కోరుతున్నామని, సవరణలకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టే విషయమై త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని అన్నారు. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్ సభలో 184వ నిబంధన కింద నోటీస్ ఇచ్చామని, నోటీస్  పై చర్చతో పాటు ఓటింగ్ కూడా ఉంటుందని, ఒకవేళ ఆ నోటీస్ ను స్పీకర్ అనుమతించకపోతే, కాంగ్రెస్సే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని అన్నారు.

More Telugu News