Virat Kohli: నాకేం కాలేదు.. రెండో టీ20 ఆడుతా: విరాట్ కోహ్లీ

  • సింగిల్ కోసం ప్రయత్నించి అదుపుతప్పాను
  • ఎంతవేగంగా నడుం వంచానో మీ అందరికీ తెలుసు
  • తొడ కండరం పట్టేయడంతో మైదానం వీడాల్సి వచ్చింది

తనకేం కాలేదని, రెండో టీ20 మ్యాచ్ కు అందుబాటులో ఉంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. గాయం గురించి వివరిస్తూ, సింగిల్ కోసం ప్రయత్నించి అదుపుతప్పానన్నాడు. అదృష్టవశాత్తు కండరం మాత్రమే పట్టుకుందని తెలిపాడు. తానెంత వేగంగా నడుం వంచానో అందరికీ తెలుసని పేర్కొన్నాడు. అప్పుడే తొడ కండరం పట్టేసిందని చెప్పాడు. దాంతోనే తాను మైదానం వీడాల్సి వచ్చిందని వివరించాడు.

 వైద్యుల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని కోహ్లీ తెలిపాడు. రెండో టీ20కి అందుబాటులో ఉంటానని చెప్పాడు. కాగా, సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 14వ ఓవర్‌ లో ఫీల్డింగ్ చేస్తుండగా చీలమండ గాయంతో కోహ్లీ మైదానం వీడాడు. డ్రెస్సింగ్ రూమ్‌ లో ఫిజియో ప్రాథమిక చికిత్స కూడా చేశాడు. ఐతే గాయం తీవ్రత కారణంగా తిరిగి ఫీల్డింగ్ కి రాకపోవడంతో, ధోనీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించి, జట్టును విజయపథంలో నడిపిన సంగతి తెలిసిందే. 

More Telugu News