nithin: 'ఛలో' దర్శకుడితో నితిన్ .. కథపై జరుగుతోన్న కసరత్తు!

  • 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ కుడుముల
  • తదుపరి సినిమాకి ఛాన్స్ ఇచ్చిన పెద్ద బ్యానర్ 
  • కథానాయకుడిగా నితిన్

వెంకీ కుడుముల దర్శకత్వంలో ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'ఛలో' సినిమా, తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోను భారీ విజయాన్ని సాధించింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా లాభాల బాట పట్టింది. ఈ సినిమాకి యూత్ నుంచి వచ్చిన ఆదరణ చూసిన హారిక అండ్ హాసిని బ్యానర్ వారు వెంకీ కుడుములతో ఒక సినిమా చేయడానికి ఆసక్తిని చూపినట్టుగా వార్తలు వచ్చాయి.

నితిన్ కి తగినట్టుగా ఒక కథను సిద్ధం చేయమని వెంకీ కుడుములతో వాళ్లు చెప్పారనేది తాజా సమాచారం. దాంతో అందుకు సంబంధించిన కథపై వెంకీ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కథ ఓకే అయితే ఈ బ్యానర్లో నితిన్ కి ఇది రెండవ సినిమా అవుతుంది. గతంలో ఈ బ్యానర్లో వచ్చిన 'అ ఆ' ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.     

More Telugu News