jyothika: విద్యాబాలన్ కి క్రేజ్ తెచ్చిపెట్టిన పాత్రలో జ్యోతిక!

  • హిందీలో సక్సెస్ ను సాధించిన 'తుమ్హారి సులు'
  • తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు 
  • రాధామోహన్ దర్శకత్వంలో సెట్స్ పైకి  

హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జ్యోతిక, సూర్యతో వివాహం తరువాత సినిమాలకి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ మధ్యనే ఆమె తిరిగి నటించడం మొదలుపెట్టారు. తన వయసుకి తగిన .. ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ ఆమె ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఆమె .. రాధామోహన్ దర్శకత్వం వహించనున్న ఒక సినిమా చేయడానికి అంగీకరించారు.

క్రితం ఏడాది 'తుమ్హారి సులు' అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ నటించారు. నటన పరంగా ఈ సినిమా విద్యాబాలన్ కి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అనేక అవార్డులు ఆమెను పలకరించాయి. ఆ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి రాధామోహన్ రంగాన్ని సిద్ధం చేశాడు. హిందీలో విద్యాబాలన్ చేసిన పాత్రను జ్యోతిక చేయనుంది. మధ్యతరగతికి చెందిన మహిళ పాత్రలో జ్యోతిక ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి మరి.     

More Telugu News