Congress: రెస్టారెంట్‌లో వీరంగమేసిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు.. పార్టీ నుంచి ఆరేళ్లు బహిష్కరణ!

  • రెస్టారెంట్‌లో రెచ్చిపోయిన ఎమ్మెల్యే పుత్రరత్నం
  • అతడి దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడు
  • పరారీలో మహమ్మద్ నలపాడ్
  • నిందితులను వదిలిపెట్టబోమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారిస్ కుమారుడు, బెంగళూరు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ నలపాడ్ ఓ రెస్టారెంట్‌లో చెలరేగిపోయాడు. పదిమంది స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన ఆయన నానా హంగామా చేశాడు. విద్వత్ అనే వ్యక్తిని చితకబాదాడు. తీవ్రంగా గాయపడిన విద్వత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నలపాడ్, అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు.

విషయం తెలిసిన కేపీసీసీ నలపాడ్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించింది. తన కుమారుడిని పార్టీ నుంచి బహిష్కరించడంపై ఎమ్మెల్యే హ్యారిస్ మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. విషయం తెలిసి బాధిత కుటుంబాన్ని తాను పరామర్శించినట్టు చెప్పారు. తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తెలియదని, అతడి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని పేర్కొన్నారు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్యే కుమారుడి వీరంగంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.

More Telugu News