Boyapati Srinu: చరణ్ చిత్రంలో విలన్ పారితోషికమెంతో తెలిస్తే షాకే..!

  • విలన్ పాత్రలో వివేక్ ఒబెరాయ్‌కి భారీ రెమ్యూనరేషన్!
  • సినిమా కోసం 'జిల్ జిల్ జిగేల్' టైటిల్ పరిశీలన
  • హీరోయిన్‌గా బాలీవుడ్ భామ కైరా అద్వానీ 

యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. ఆయన ఈ మధ్య తీసిన 'జయ జానకి నాయక' చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవడంతో తన తదుపరి ప్రాజెక్టును సీరియస్‌గా తీసుకున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో తీస్తున్న ఈ చిత్రానికి 'జిల్ జిల్ జిగేల్' పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఇక తన సినిమాల్లో పేరున్న పరభాషా నటులను తీసుకోవడం బోయపాటికి అలవాటు. జయ జానకి నాయక చిత్రంలోనూ తమిళ స్టార్ శరత్ కుమార్‌ని ఎంపిక చేసుకున్న ఆయన, ఈ సారి చరణ్ చిత్రం కోసం బాలీవుడ్‌ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ని సెలక్ట్ చేసుకున్నారు. ఈ చిత్రంలో వివేక్ విలన్ పాత్రలో కన్పించనున్నాడు. ఆయన పాత్రను దర్శకుడు స్పెషల్‌గా తీర్చిదిద్దాడనే వార్త వినబడుతోంది.

విలన్ పాత్రకు ఉన్న డిమాండ్ కారణంగా రెమ్యూనరేషన్ విషయంలోనూ నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడలేదట. ఆయనకు ఏకంగా రూ.3 కోట్లు చెల్లించినట్లు సమాచారం. 'రక్తచరిత్ర' చిత్రం ద్వారా వివేక్ ఒబెరాయ్ తెలుగు ఆడియన్స్‌కు బాగానే కనెక్టయ్యాడు. తమిళంలోనూ అజిత్ నటించిన 'వివేగం' చిత్రంలోనూ ఓ కీలక పాత్ర చేశాడు. చరణ్‌తో బోయపాటి తీస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More Telugu News