devineni uma: ‘పోలవరం’ పూర్తి చేస్తుంటే జైరాం రమేష్ ఓర్చుకోలేకపోతున్నారు: దేవినేని ఉమ

  • ‘పోలవరం’పై నాలుగేళ్లుగా జైరాం నోరు ఎందుకు మెదపలేదు?
  • ఇప్పుడెందుకు రాళ్లు వేస్తున్నారు?
  • మీడియాతో మంత్రి దేవినేని

పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముడుపులు బాగా అందాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. ఈ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని జైరాం రమేష్ ఓర్చుకోలేకపోతున్నారని, అందుకే, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

‘పోలవరం’పై సవరించిన అంచనాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ధ్యేయంతో పని చేస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు రూ.2,221 కోట్ల బిల్లులను కేంద్రానికి పంపామని, వాస్తవాలు తెలుసుకుని జైరాం రమేష్ మాట్లాడాలని హితవు పలికారు. ‘పోలవరం’పై నాలుగేళ్లుగా నోరు మెదపని జైరాం రమేష్, ఇప్పుడెందుకు రాళ్లు వేయడం ప్రారంభించారని, నాడు విభజన చట్టాన్ని రూపొందించిన జైరాం రమేష్, ముంపు మండలాలను ఏపీలో ఎందుకు కలపలేదని దేవినేని ప్రశ్నించారు.  

More Telugu News