rice: ఈ మూడు రకాల బియ్యంలో కేన్సర్ నిరోధక గుణాలు... పరిశోధనతో వెలుగులోకి!

  • గత్వాన్, మహారాజి, లైచా రకాల్లో ఔషధ గుణాలు
  • ఈ మూడు ఛత్తీస్ గఢ్ లో వినియోగం
  • వీటిపై ఇందిరాగాంధీ క్రిషి విశ్వవిద్యాలయం పరిశోధన

సంప్రదాయ బియ్యం రకాలు మూడింటిలో కేన్సర్ నిరోధక గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో వెలుగు చూసింది. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో లభించే గత్వాన్, మహారాజి, లైచా రకాలకు కేన్సర్ పై పోరాడే ఔషధ సుగుణాలు ఉన్నాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త దీపక్ శర్మ తెలిపారు. రాయ్ పూర్ లోని ఇందిరాగాంధీ క్రిషి విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించింది.

ఈ మూడు బియ్యం రకాలకు ఊపిరితిత్తులు, బ్రెస్ట్ కేన్సర్ ను నయం చేసే గుణాలు ఉన్నాయని, అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని చేయవని శర్మ వెల్లడించారు. ఈ మూడింటిలో లైచా రకం కేన్సర్ కణాల పునరుత్పాదనకు బ్రేక్ వేయడంతోపాటు వాటిని నిర్వీర్యం చేయడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా బస్తర్ రీజియన్ లో లైచా, మహారాజి రకాలను ఔషధ ప్రయోజనాల కోణంలో వినియోగిస్తున్నట్టు శర్మ వెల్లడించారు. గత్వాన్ రకానికి ఆర్థరైటిస్ ను నయం చేసే గుణాలు కూడా ఉన్నట్టు చెప్పారు.

More Telugu News