pnb scam: ప్రతీ ఎల్ వోయూకు కొంత కమిషన్... విచారణలో పీఎన్ బీ స్కామ్ నిందితుల వెల్లడి

  • ఆ కమిషన్ ను పంచుకున్న బ్యాంకు ఉద్యోగులు
  • వాటి విలువలో నిర్ణీత శాతం కమిషన్
  • సీబీఐ విచారణలో వెలుగులోకి

పంజాబ్ నేషనల్ బ్యాంకు జారీ చేసిన లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ (హామీ పత్రం)ల ఆధారంగా వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కంపెనీలు విదేశీ బ్యాంకు శాఖల నుంచి రూ.11,400 కోట్ల మేర రుణాలు పొంది మోసం చేసిన విషయం తెలిసిందే. ఎల్ వోయూ అన్నది దేశీయ వ్యాపార సంస్థలు విదేశాల్లో చెల్లింపుల కోసం తీసుకునే రుణ హామీ పత్రం. వీటిని విదేశీ శాఖల్లో సమర్పించి కొనుగోళ్లకు చెల్లింపులు చేస్తుంటారు. ముంబైలోని పీఎన్ బీ బ్రాడీ బ్రాంచ్ నుంచి ఈ ఎల్ వోయూలను నీరవ్ మోదీ కంపెనీలు సంపాదించాయి. నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు అయినా నిర్ణీత మొత్తం క్యాష్ మార్జిన్ ఉంటేనే ఎల్ వోయూ జారీ చేస్తాయి.

కానీ, నీరవ్ మోదీ కంపెనీ ఉద్యోగులు ఎటువంటి క్యాష్ మార్జిన్ లేకుండానే ఎల్ వోయూలను సంపాదించాయి. ఇందుకు గాను ప్రతీ ఎల్ వోయూపై ఇంతేసి కమిషన్ ఫిక్స్ డ్ గా వసూలు చేసినట్టు విచారణలో నిందితులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్కామ్ తో సంబంధం ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, నీరవ్ మోదీ కంపెనీ ఉద్యోగిని సీబీఐ శనివారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిర్ణీత శాతం చొప్పున ఎల్ వోయూల (వాటి విలువలో) జారీకి తీసుకున్నట్టు వీరు తెలిపారు. ఇలా వసూలు చేసిన కమిషన్ ను ఈ స్కామ్ లో భాగం ఉన్న బ్యాంకు ఉద్యోగులు అందరూ పంచుకునేవారమని వెల్లడించారు.

More Telugu News