nirav modi: ఈ ఒక్క ఏడాది స్కామ్ బయటకు రాకపోతే... వారి పంట పండేది..!

  • ఈ ఏడాదే ఐపీవోకు రావాలనుకున్న ఫైర్ స్టార్ డైమండ్
  • ఐపీవోకు అనుమతి పొందిన నక్షత్ర వరల్డ్
  • ఈ రెండూ నీరవ్ మోదీ, మోహుల్ చోక్సేలకు చెందినవి
  • స్కామ్ బయటకు రావడంతో డోర్లు క్లోజ్

వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.11,400 కోట్ల మేర మోసం చేసిన స్కామ్ వెలుగు చూసి ఉండకపోతే అతడు, అతడి సమీప బంధువు, గీతాంజలి జెమ్స్ అధినేత మోహుల్ చోక్సేల పంట పండి ఉండేది. ఎలాగంటారా...? రూ.15,000 కోట్ల టర్నోవర్ ఉన్న నీరవ్ మోదీ కంపెనీ ఫైర్ స్టార్ డైమండ్ ఈ ఏడాదే పబ్లిక్ ఇష్యూకు రావాలనుకుంది. దీనిద్వారా మోదీ తన కంపెనీలో కొంత వాటాను ఐపీవోలో విక్రయించి నిధులు రాబట్టాలనుకున్నారు.

అలాగే, గీతాంజలి జెమ్స్ కు చెందిన నక్షత్ర వరల్డ్ ఐపీవోకు వచ్చేందుకు గత ఏడాది సెబీని సంప్రదించగా, 2017 నవంబర్ లోనే అనుమతి లభించింది. ఇంత వరకు నిధుల సమీకరణ చేయలేదు. ఇంతలోనే స్కామ్ లీకయిపోయింది. ఒకవేళ పీఎన్ బీ లో ఎల్ వోయూల స్కామ్ వెలుగు చూసి ఉండకపోతే ఈ రెండు ఐపీవోలు ఈ ఏడాది పూర్తయి ఉండేవని విశ్లేషకులు భావిస్తున్నారు. వీరి మోసం వెలుగు చూడడంతో నిందితులైన బడా వ్యాపారవేత్తలు గత నెలలోనే దేశం విడిచిపెట్టి వెళ్లిపోయినందున ఇక ఐపీవోలకు అవకాశం లేనట్టే. మొత్తానికి సామాన్య ఇన్వెస్టర్లు ఈ మాత్రమన్నా సేఫ్ అయ్యారు.

More Telugu News