Yameen: మాల్దీవుల్లో నిరసనలు మళ్లీ మొదలు..అత్యవసర పరిస్థితిని లెక్కచేయని వైనం.. యమీన్‌ రాజీనామాకు డిమాండ్

  • అధ్యక్షుడు యమీన్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి నిరసనకారులు
  • పోలీసుల అదుపులో వందలాదిమంది 
  • లాఠీచార్జ్‌లో పలువురికి గాయాలు

అత్యవసర పరిస్థితి విధించి దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న మాల్దీవుల అధ్యక్షుడు యమీన్ అబ్దుల్‌ గయూమ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. యమీన్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చారు. యమీన్ రాజీనామా చేయడంతోపాటు జైలులో ఉన్న ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల్లో వేలాదిమంది పాల్గొన్నారు.

ఆందోళనకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వందలాదిమందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో పలువురు ఆందోళనకారులు గాయపడ్డారు. తమ అదుపులో ఎంతమంది ఉన్నదీ చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. గాయాలపాలైన వారిలో పదిమంది రిపోర్టర్లు కూడా ఉన్నారు.

దేశంలో నిరసన తెలిపే హక్కును రద్దు చేసినప్పటికీ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారని, తమ హెచ్చరికలను బేఖాతరు చేయడం వల్లే లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరించారు. రాజకీయ నేతల ప్రోద్బలంతోనే ఈ నిరసనలు జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు.

More Telugu News