Samanta: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • రాజమండ్రిలో సమంత సినిమా షూటింగ్ 
  • బోయపాటి సినిమాలో ఆర్యన్ రాజేష్ కీలక పాత్ర
  • తమిళంలో రకుల్ కొత్త చిత్రం 
  • తెలుగులోకి మలయాళ 'ఆనందం'


*  కన్నడలో హిట్టయిన 'యూ టర్న్' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇందులో సమంత కథానాయికగా జర్నలిస్ట్ పాత్రను పోషిస్తోంది. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది.
*  రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ రెండో షెడ్యూల్ షూటింగ్ ఈ నెలలోనే జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి తాజా వార్త ఏమిటంటే, గతంలో కొన్ని సినిమాలలో హీరోగా నటించిన ఆర్యన్ రాజేష్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తాడట.  
*  తాజాగా 'అయ్యారీ' హిందీ చిత్రాన్ని చేసిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ప్రస్తుతం ఏ చిత్రానికీ సంతకం చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిన్నది తమిళంలో ఓ చిత్రాన్ని ఒప్పుకుంది. శివకార్తికేయన్ హీరోగా నటించే సైంటిఫిక్ థ్రిల్లర్ లో రకుల్ హీరోయిన్ గా నటిస్తుంది.
*  మలయాళంలో 'ఆనందం' పేరిట వచ్చిన చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోకి డబ్ చేస్తున్నారు. కాలేజీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మలయాళంలో పెద్ద హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. గణేశ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా నూతన హీరోహీరోయిన్లు పరిచయమయ్యారు. వచ్చే నెల 16న దీనిని రిలీజ్ చేస్తారు.

More Telugu News