Mexico: మెక్సికో దుర్ఘటన: మంత్రి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్... 13 మంది మృతి!

  • సైనిక హెలికాప్టర్‌ లో సాంకేతిక సమస్య 
  • క్రాష్ ల్యాండింగ్ జరిగిన ప్రాంతంలో ప్రజలు
  • మృతుల్లో ముగ్గురు చిన్నారులు

భూకంపంతో కుదేలైన ప్రాంతంలో పర్యటించి, ప్రజలకు ధైర్యం చెప్పాలన్న ఆలోచనతో హోం మంత్రి హెలికాప్టర్ లో వెళుతున్న వేళ, అది క్రాష్ ల్యాండింగ్ కాగా, కింద ఉన్న 13 మంది మరణించిన ఘోర దుర్ఘటన మెక్సికోలో జరిగింది. ఆ దేశ హోం మంత్రి అల్ఫోన్సో నవరెట్, ఓక్సాక స్టేట్‌ గవర్నర్‌ అలెజాండ్రో మురాత్‌ లు సైనిక హెలికాప్టర్‌ లో భూకంప బాధిత ప్రాంతానికి వెళుతుండగా, అందులో సమస్య ఏర్పడి, దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

దీంతో హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో ఉన్న ఐదుగురు, మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 12 మంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ ప్రమాదంలో గవర్నర్, మంత్రి క్షేమంగా బయటపడటం గమనార్హం.

More Telugu News