rgv: రామ్ గోపాల్ వర్మ మొబైల్, ల్యాప్ టాప్ సీజ్ చేసిన పోలీసులు.. వచ్చే శుక్రవారం మళ్లీ రావాలంటూ ఆదేశం!

  • ముగిసిన సీసీఎస్ పోలీసుల విచారణ
  • 3 గంటల 20 నిమిషాల పాటు ప్రశ్నల పరంపర
  • 24 ప్రశ్నలకు వివరణ కోరిన పోలీసులు

'జీఎస్టీ' సినిమాలో అశ్లీలత, మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను సీసీఎస్ పోలీసులు విచారించారు. కాసేపటి క్రితమే విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల 20 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. విచారణ సందర్భంగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తం 24 ప్రశ్నలకు పోలీసులు వివరణ కోరినట్టు సమాచారం.

ఈ రోజు విచారణ ముగిసిన వెంటనే మరో నోటీసును వర్మకు అందజేశారు. వచ్చే శుక్రవారం కూడా మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ ను పోలీసులు సీజ్ చేశారు. వర్మకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటివారితో సంబంధాలు ఉన్నాయి? తదితర అంశాలకు సంబంధించిన వివరాలు వీటిలో లభించే అవకాశం ఉన్నందున... పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. 

More Telugu News