Arunachal Pradesh: అరుణాచల్‌లో మోదీ పర్యటనపై చైనా ఆగ్రహం.. గట్టిగా సమాధానం ఇచ్చిన భారత్!

  • దౌత్యపరమైన నిరసన చేపడతామని నిన్న చైనా ప్రకటన
  • అరుణాచల్ వెళ్లేందుకు మాకు పూర్తి అధికారం ఉంది 
  • అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లోని అంతర్భాగం

తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించడంపై చైనా మండిపడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిన్న మోదీ అక్కడకు వెళ్లగా... దీనిపై దౌత్యపరమైన నిరసన చేపడతామని చైనా ప్రకటించింది.

  చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్ గట్టిగా సమాధానం చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్‌కు వెళ్లేందుకు తమ నేతలు, ప్రజలకు పూర్తి అధికారం ఉందని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ అన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు.

More Telugu News