Tollywood: అమెరికాలో ‘అ!’కు మంచి కలెక్షన్లు!

  • అమెరికాలో ‘అ!’ కు మంచి టాక్
  • ప్రీమియర్ షో ల ద్వారా 1,07,612 డాలర్ల కలెక్షన్లు
  • సినీ ట్రేడ్ వర్గాల వెల్లడి 

హీరో నాని స్వయంగా నిర్మాతగా మారి, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అ!’. ‘వాల్ పోస్టర్’ బ్యానర్ కింద నిర్మితమైన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. నిత్యామీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

 ఈ చిత్రం ఇక్కడ విడుదల కావడానికి ఒకరోజు ముందుగానే అమెరికాలో విడుదల చేశారు. ఈ చిత్రానికి అక్కడ కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రీమియర్ షో ల ద్వారా 1,07,612 డాలర్లను సంపాదించుకున్నట్టు సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వైవిధ్యమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి ఈ స్థాయి కలెక్షన్లు రావడం శుభపరిణామంగా భావిస్తున్నారు.  

More Telugu News