junior ntr: మార్చి 23 నుంచి ఎన్టీఆర్- త్రివిక్రమ్ చిత్రం షూటింగ్?

  • జులై నాటికి ముగియనున్న షూటింగ్ 
  • దసరాకు చిత్రాన్ని విడుదల చేసే ఆలోచన 
  • త్వరలో వివరాలను ప్రకటించనున్న చిత్ర బృందం 

త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రం మార్చి 23 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను జులై నాటికి ముగించి, చిత్రాన్ని ఈ ఏడాది దసరా నాటికి విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరుపెట్టలేదు. ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన విషయాలను అధికారికంగా చిత్రయూనిట్ త్వరలో ప్రకటించనుంది. 

More Telugu News