RGV: రామ్ గోపాల్ వర్మను వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పోలీసులు.. ప్రశ్నలు ఇవే!

  • సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న వర్మ
  • పలు కోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు
  • మహిళలపై అసభ్యకర కామెంట్లు చేయడం తప్పు కాదా అని ప్రశ్నించిన అధికారులు

'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా నిర్మాణం, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులకు సంబంధించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మపై విచారణ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం.

విశ్వసనీయ సమాచారం ప్రకారం వర్మ ఎదుర్కొన్న కొన్ని ప్రశ్నలు...

  • ఐటీ యాక్ట్ ప్రకారం మహిళలను అశ్లీలంగా చూపించడం తప్పు. దీనికి మీ సమాధానం ఏమిటి?
  • మీ ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లలో పెట్టిన పోర్న్ స్టార్ మియా మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?
  • ఓ టీవీ ఛానల్ చర్చలో విశాఖపట్నంకు చెందిన మహిళ మీద మీరు చేసిన కామెంట్లు అభ్యంతరకరం కాదా?
  • దేవితో పోర్న్ సినిమా తీస్తాననడం ఎంత వరకు కరెక్ట్?
  • ఈ సినిమాకు భారతీయ చట్టాలు వర్తించవు అని మీరు అంటున్నారు.... దీనికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి?
  • సినిమాను అమెరికాలో తీశాను, అక్కడ నుంచే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేశామని చెబుతున్నారు. సినిమాను ఎలా తీశారు? పెట్టుబడి ఎవరు పెట్టారు?
  • విమియో వెబ్ సైట్ కు ఈ సినిమాను ఎంతకు అమ్మారు?
  • సినిమాలో నటించిన మాల్కోవాకి డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు?  

More Telugu News