apple: దిగ్గజ సంస్థ యాపిల్ కి చుక్కలు చూపిస్తున్న తెలుగు అక్షరం!

  • 'జ్ఞా' అనే ఒక తెలుగు అక్షరం వల్ల ఏర్పడిన సమస్య
  • తొలిసారిగా గుర్తించిన ఇటాలియన్ బ్లాగ్
  • ఐవోఎస్‌ 11.3 అప్‌డేట్ వచ్చే వరకూ వేచి ఉండాలంటున్న నిపుణులు

ఏడాదికో కొత్త మోడల్ తో మార్కెట్లోకి దూసుకువస్తున్న ఐఫోన్లకు ఇప్పుడు ఒక తెలుగు అక్షరం వల్ల కొత్త సమస్య ఏర్పడింది. తెలుగు భాషలో అరుదుగా వాడే  'జ్ఞా' అనే ఈ ఒక్క పదం వల్ల ఫోన్లో సామర్ధ్యాన్ని పూర్తిగా నెమ్మదించేలా చేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐవోఎస్‌ 11.2.5 వెర్షన్ వాడుతున్న వారు 'జ్ఞా' అక్షరాన్ని టైప్‌ చేసి పంపేందుకు యత్నిస్తే ఆ యాప్‌ క్రాష్‌ అవుతోందని తలలు పట్టుకుంటున్నారు.

ఈ విషయాన్ని తొలిసారిగా ఇటాలియన్ బ్లాగ్ రిపోర్ట్ చేసింది. అయితే, ఈ అక్షరం నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా, ఈ విషయంలో యాపిల్ కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది. మరోపక్క, ఐవోఎస్‌ 11.3లో దీన్ని ఫిక్స్‌ చేసినట్లు చెబుతున్నారు. ఐవోఎస్‌ 11.2 వాడుతున్న వారు 11.3 అప్‌డేట్ వచ్చే వరకూ వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News