mohan lal: షాక్ ఇస్తోన్న మోహన్ లాల్ ఫస్టులుక్

  • మోహన్ లాల్ తాజా చిత్రంగా 'కాయకులం కొచ్చున్ని'
  • ఓ దోపిడీ దొంగ జీవితచరిత్రయే కథగా 
  • ప్రధాన పాత్రల్లో నివిన్ పౌలి .. ప్రియా ఆనంద్

మలయాళ సూపర్ స్టార్ గా మోహన్ లాల్ కి గల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన తాజా చిత్రంగా 'కాయకులం కొచ్చున్ని' రూపొందుతోంది. ఈ సినిమాలో 'ఇత్తిక్కారపక్కి' అనే పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో 'సెంట్రల్ ట్రావెన్ కోర్' ప్రాంతంలో ధనవంతులను దోచుకుని పేదలకు పంచే ఒక దొంగ కథ ఇది.

ఓ దోపిడీ దొంగ జీవితచరిత్ర ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి, హీరో నివిన్ పౌలి ట్విట్టర్ ద్వారా మోహన్ లాల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశాడు. 'ఇత్తిక్కారపక్కి' అనే అరవీరభయంకరుడి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. ఈ లుక్ ఆయనకి పర్ఫెక్ట్ గా సూతయ్యిందనీ .. తెరపై కొత్త మోహన్ లాల్ ను చూడబోతున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మోహన్ లాల్ తో పాటు నివిన్ పౌలి .. ప్రియా ఆనంద్ ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాలోని తన పాత్రకోసం, కేరళ సంప్రదాయ యుద్ధ విద్యలో మోహన్ లాల్ శిక్షణ తీసుకోవడం విశేషం.   

More Telugu News