kalva srinivasulu: నవ్వాలో, ఏడవాలో అర్థం కావట్లేదు: జగన్‌పై మంత్రి కాల్వ శ్రీనివాసులు చురకలు

  • త‌మతో క‌లిసి రావాలని జగన్ అన్నారు
  • ఆర్థిక నేర‌గాడితో మేం క‌లిసి వెళ్లాలా?
  • ప్రత్యేక హోదా కావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడుగుతూనే వ‌చ్చాం
  • హోదాకు స‌మాన‌మైన స్థాయిలో నిధులిస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నాం

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు సాధించడం కోసం తమ లోక్‌సభ సభ్యులు రాజీనామా చేస్తున్నారని, అలాగే తమతో కలిసి పోరాడడానికి టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి తమతో కలిసి రావాలని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ.. ఆయన వ్యాఖ్యలకు న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కావ‌ట్లేదని అన్నారు. ఆర్థిక నేర‌గాడితో మేం క‌లిసి వెళ్లాలా? అని ప్ర‌శ్నించారు.  

ప్ర‌త్యేక హోదా రావాల‌ని తాము కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడుగుతూనే వ‌చ్చామ‌ని కాల్వ శ్రీనివాసులు అన్నారు. హోదాకు స‌మాన‌మైన స్థాయిలో నిధులిస్తామంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌న్నారు. కేంద్ర‌ బడ్జెట్‌ను విజయసాయిరెడ్డి ప్రశంసించారని, ఎంపీల రాజీనామా పేరుతో సరికొత్త అస్త్రం తీశారని వైసీపీ డ్రామాకు తెరలేపిందని వ్యాఖ్యానించారు.

కాగా, పవన్ కల్యాణ్ ఆధ్వ‌ర్యంలో కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రానికి చేసిన సాయంపై విశ్లేషించడానికి వచ్చిన వారికి స్వాగతం ప‌లుకుతున్న‌ట్లు కాల్వ శ్రీనివాసులు చెప్పారు. లెక్కలు, సమాచారం కావాలని ప్రభుత్వాన్ని రాత పూర్వకంగా ఎవరూ అడగలేదని అన్నారు.

More Telugu News