oviya: ఒవియా ప్రధాన పాత్రగా '90 ఎమ్మెల్'

  • యూత్ లో ఒవియాకు విపరీతమైన క్రేజ్ 
  • తమిళంలో తాజాగా ఓకే చేసిన సినిమా
  •  సంగీత దర్శకుడిగా హీరో శింబూ

తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో నటిగా 'ఒవియా'కి మంచి గుర్తింపు వుంది. ఇక ఆ మధ్య ఆమె తమిళ 'బిగ్ బాస్' షోలో చేయడంతో, ఆమె పాప్యులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. ఈ షో ఆమెకి మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతూనే వుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె కథానాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అనిత ఉదీప్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతోంది. తాజాగా ఈ సినిమాకి '90 ఎమ్మెల్' అనే టైటిల్ ను ఖరారు చేసి .. ఒక పోస్టర్ ను వదిలారు. టైటిల్ కి తగినట్టుగానే టైటిల్ లోగోను డిజైన్ చేయించారు. స్టార్ హీరో శింబూ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. తమిళంలో ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి .. అంచనాలు వున్నాయి. ఇక తెలుగులో ఒవియా చేసిన 'ఇది నా లవ్ స్టోరీ' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.   

More Telugu News