Tollywood: ‘శివ’ను గుర్తుచేసుకున్న హీరో నాగార్జున

  • 29 సంవత్సరాల క్రితం ఇదే రోజున ‘శివ’ ప్రారంభించాం
  • కొత్త ఆలోచనా దృక్పథానికి నాంది పలికిన ‘శివ’
  • మా కాంబినేషన్ లో మరో చిత్రంతో రాక్ చేసే సమయం ఆసన్నమైంది : నాగార్జున ట్వీట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తొలి సినిమా ‘శివ’ తొలి రోజు షూటింగ్ జరిగింది ఈరోజేనని చెబుతూ ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘శివ’ హీరో నాగార్జున కూడా ఓ ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 16 1989..29 సంవత్సరాల క్రితం ఇదే రోజున సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన, కొత్త ఆలోచనా దృక్పథానికి నాంది పలికిన ‘శివ’ చిత్రం ప్రారంభించామని, నాగ్-వర్మ కాంబినేషన్ లో వచ్చే మరో చిత్రంతో రాక్ చేసే సమయం ఆసన్నమైందని నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా వర్మ-నాగ్ కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త చిత్రం స్టిల్స్ ను నాగార్జున పోస్ట్ చేశారు.

More Telugu News