నా తొలి సినిమా తొలిరోజు షూటింగ్ జరిగింది ఈరోజే: దర్శకుడు వర్మ

Fri, Feb 16, 2018, 01:44 PM
  • తన తొలి సినిమా ‘శివ’ గురించి ప్రస్తావించిన వర్మ
  • నా కొత్త సినిమా హీరో నాగార్జున ఫొటోను పోస్ట్ చేస్తున్నా
  • వర్మ పోస్ట్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన నెటిజన్లు
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తొలి సినిమా ‘శివ’ గురించి ప్రస్తావిస్తూ తాజాగా ఓ ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఫిబ్రవరి 16. నా తొలి సినిమా తొలి రోజు షూటింగ్ ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా హీరో నాగార్జున ఫొటోను పోస్ట్ చేస్తున్నా’ అని ఆ ట్వీట్ లో వర్మ పేర్కొన్నారు. కాగా, వర్మ-నాగార్జున కాంబినేషన్ లో కొత్త సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వస్తున్న నాల్గో సినిమా ఇది. కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad