aditya menon: నాకు బాగా నచ్చిన సినిమా 'అర్జున్ రెడ్డి': ఆదిత్య మీనన్

  • ఈ మధ్య 'అర్జున్ రెడ్డి' చూశాను 
  • విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు
  • కథ సహజత్వానికి దగ్గరగా వుంది

విలన్ షేడ్స్ కలిగిన పవర్ ఫుల్ పాత్రల్లో ఆదిత్య మీనన్ మెప్పిస్తూ వస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో కూడిన పాత్రల్లోను .. మోడ్రన్ పాత్రల్లోను ఆయన ఒదిగిపోతూ వుంటారు. అలాంటి ఆదిత్య మీనన్ .. తాజాగా ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. " ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో 'అర్జున్ రెడ్డి' నన్ను బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాలోని సహజత్వం .. విజయ్ దేవరకొండ నటన నాకు బాగా నచ్చాయి' అన్నారు.

 'కథానాయకుడిని సూపర్ హీరోగా కాకుండా సాధారణమైన యువకుడిగా చూపించిన తీరు బాగుంది' అన్నారు. విజయ్ దేవరకొండకి తండ్రి పాత్రను చేసే అవకాశం వస్తే చేస్తారా ? అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ .. 'ఫలానా పాత్ర అని కాదు .. నాకు వచ్చిన పాత్రలను చేస్తూ వెళుతుంటాను. ఏ పాత్రను అంగీకరించినా ఎంత బాగా చేశామా అనే విషయంపైనే నేను ఎక్కువ దృష్టి పెడుతుంటాను' అంటూ చెప్పుకొచ్చారు.    

More Telugu News