warla ramaiah: పవన్ కల్యాణ్ విజ్ఞతకే వదిలేస్తున్నాం: టీడీపీ నేత వర్ల రామయ్య

  • జేఎఫ్‌సీ ఏర్పాటుపై చర్చించడానికి పవన్ కల్యాణ్‌ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలిచారు?
  • కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పవన్ కల్యాణ్ శ్వేతపత్రం అడగాలి
  • పవన్ కల్యాణ్‌కు కావాల్సిన వివరాలన్నీ మేం వెబ్‌సైట్‌లో పెట్టాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర ప్ర‌భుత్వం అందించిన సాయంపై సంయుక్త నిజ నిర్ధారణ కమిటీ వేసి నివేదిక రూపొందించి, అనంతరం పోరాటం చేస్తామని సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించి విమర్శలు చేశారు. జేఎఫ్‌సీ ఏర్పాటుపై చర్చించడానికి పవన్ కల్యాణ్‌ కాంగ్రెస్ పార్టీని పిలిచిన అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పవన్ కల్యాణ్ శ్వేతపత్రం అడగాలని అన్నారు. కాగా, పవన్ కల్యాణ్‌కు కావాల్సిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ప్రకారం వెబ్‌సైట్‌లో పెట్టామని ఇప్పటికే మంత్రులు తెలిపారు.     

More Telugu News