apple: ఈ ఏడాది యాపిల్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు

  • ఐఫోన్ ఎక్స్ స్థానంలో కొత్త మోడల్
  • 10 కోట్ల ఫోన్ల అమ్మకాల లక్ష్యం
  • ధర 700 డాలర్ల స్థాయిలో
  • తైవాన్ విశ్లేషణ సంస్థ అంచనా

దిగ్గజ స్మార్ట్ ఫోన్ సంస్థ యాపిల్ ఈ ఏడాది మూడు స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనుంది. వీటిలో ఒకటి చాలా పాప్యులర్ అయ్యే మోడల్ ఉంటుందని తైవాన్ కు చెందిన ప్రముఖ విశ్లేషణా సంస్థ కేజీఐ సెక్యూరిటీస్ తెలిపింది. కేజీఐ సెక్యూరిటీస్ కు చెందిన ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్చీ క్యూ వెల్లడించిన వివరాల మేరకు... 6.1 అంగుళాలతో యాపిల్ ఈ ఏడాది విడుదల చేయనున్న ఒక మోడల్ 100 మిలియన్ యూనిట్లు (10 కోట్లు) విక్రయించాలన్నది లక్ష్యం.

ఈ ఫోన్ ఐఫోన్ ఎక్స్ కు పోలికగా ఫుల్ స్క్రీన్ డిజైన్ తో ఉంటుంది. ఐఫోన్ 8, 8 ప్లస్ మోడళ్ల స్థానంలో ప్రవేశపెట్టే దీని ధర 699 డాలర్లు ఉంటుందని అంచనా. ఇది కాకుండా మరో రెండు ఫోన్లను కూడా విడుదల చేయనుంది. ఐఫోన్ ఎక్స్ ఇప్పటికే 6.2 కోట్ల యూనిట్లను రవాణా చేయడం జరిగిందని, దీని తయారీని ఈ ఏడాది మధ్యలో నిలిపివేయవచ్చని క్యూ అంచనా వేశారు.

More Telugu News