nani: చిరంజీవి 'చంటబ్బాయ్' రీమేక్ చేయాలనుంది: నాని

  • రేపే ప్రేక్షకుల ముందుకు 'అ!' మూవీ
  • ఆసక్తిని రేపుతోన్న కంటెంట్  
  • ప్రమోషన్స్ లో బిజీగా నాని

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నాని నిర్మించిన 'అ!' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్ .. రెజీనా .. నిత్యామీనన్.. ఈషా రెబ్బా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా వున్నాడు. గతంలో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాను రీమేక్ చేయాలనుంది? అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో నానికి ఎదురైంది.

 అందుకు నాని స్పందిస్తూ .. 'చంటబ్బాయ్' సినిమా పేరు చెప్పాడు. జంధ్యాల దర్శకత్వంలో 1986లో వచ్చిన ఈ సినిమా, చిరంజీవి అభిమానులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో లేడీ గెటప్ లో చిరంజీవి చేసిన సందడి అంతా ఇంతా కాదు. అలాంటి ఈ సినిమాను రీమేక్ చేయాలనుందని నాని చెప్పడం ప్రత్యేకతను సంతరించుకుంది. నాని సొంత బ్యానర్లో 'చంటబ్బాయ్' రీమేక్ రూపొందుతుందేమో చూడాలి మరి .    

More Telugu News