huawei: హువావే, జెడ్ టీఈ ఫోన్లు వాడుతున్నారా...? వాడొద్దంటూ అమెరికాలో ఇంటెలిజెన్స్ హెచ్చరికలు

  • సమాచార భద్రతకు ముప్పు
  • విలువలను పాటించవు
  • సీఐఏ, ఎఫ్ బీఐ, ఎన్ఎస్ఏ అధినేతల ఆందోళన

చైనాకు చెందిన హువావే, జెడ్ టీఈ బ్రాండ్ల ఫోన్లు వాడుతుంటే ఓ సారి పరిశీలించుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ ఫోన్లను వాడొద్దంటూ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తమ దేశ పౌరులను హెచ్చరించారు. ఇంటెలిజెన్స్, దర్యాప్తు ఏజెన్సీలు సీఐఏ, ఎఫ్ బీఐ, ఎన్ఎస్ఏ అధినేతలు, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ మంగళవారం రాత్రి జరిగిన సేనేట్ ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశంలో ఈ ఫోన్లపై ఆందోళన వ్యక్తం చేశారు.

"విదేశీ ప్రభుత్వాల ఆధ్వర్యంలోని కంపెనీలను, సంస్థలను అనుమతించడం పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నాం. అవి అమెరికా టెలికం నెట్ వర్క్ లో ఎదిగేందుకు గాను ఇక్కడి విలువలను పాటించవు’’ అని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ క్రిస్ వ్రే అన్నారు. అవి హానిపూర్వకంగా సమాచారాన్ని తస్కరించడం లేదా మార్పు చేసే ప్రమాదం ఉందన్నారు. ఈ ఆందోళనలకు హువావే స్పందించింది. ‘‘హువావే 170 దేశాల్లో ప్రభుత్వాలు, కస్టమర్ల విశ్వాసం చూరగొన్నది. మా వల్ల ఎటువంటి ముప్పు లేదు. ప్రపంచవ్యాప్తంగా తాము ఒకే సరఫరా చైన్, తయారీ సామర్థ్యాలను కలిగి ఉన్నాం’’ అని ప్రకటన జారీ చేసింది.

More Telugu News