venkatesh: రెగ్యులర్ షూటింగుకి రెడీగా 'ఆట నాదే .. వేట నాదే'

  • వెంకటేశ్ హీరోగా 'ఆట నాదే .. వేట నాదే'
  • వచ్చేనెల 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తొలి షెడ్యూల్    

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆట నాదే .. వేట నాదే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. 'నేనే రాజు నేనే మంత్రి' తరహాలోనే ఈ టైటిల్ ఉండటం విశేషం. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రియను ఎంపిక చేసుకున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని వెంకీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 ఈ క్రమంలో వచ్చేనెల 12 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు సమాచారం. తొలి షెడ్యూల్ ను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ప్లాన్ చేశారట. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. నారా రోహిత్ కీలకమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News