అసలే చలి, ఆపై వాలెంటైన్స్ డే... ఒంటరినంటూ అమ్మాయి డేటింగ్ కు పిలిస్తే..!

15-02-2018 Thu 09:34
  • ప్రస్తుతం సౌత్ కొరియాలో ఉన్న యూఎస్ అథ్లెట్ లిండ్సే వాన్
  • ఓ ప్రేమికుడు కావాలి
  • 10 లక్షల మంది ట్విట్టర్ అభిమానుల ముందు తన కోరిక
  • స్పందించిన వేలాది మంది
అసలే ఎముకలు కొరికేసే చలికాలం. పైగా ప్రేమికుల రోజు. తానున్నది దేశం కాని దేశంలో. ఒంటరిగా ఉంది. తోడు కావాలని మనసు కోరుకున్నదో ఏమో... డేటింగ్ కు ఎవరైనా కావాలని అడిగింది. ఎవరో తెలుసా... ప్రస్తుతం దక్షిణ కొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అమెరికా స్కీయింట్ అథ్లెట్ లిండ్సే వాన్.

ఆమెను ట్విట్టర్ ఖాతాలో దాదాపు 10 లక్షల మందికి పైగా ఫాలో అవుతుండగా, వారికి ఓ మెసేజ్ పెడుతూ, "నేడు వాలెంటైన్స్ డే. నేను వింటర్‌ ఒలింపిక్స్‌ లో ఒంటరిగా ఉన్నాను. ఎవరైనా ఈ రోజుకు నా ప్రేమికుడు అవుతారా?" అని బతిమాలింది. అమ్మాయి పిలిస్తే ఆగుతారా? వేలాది మంది ఆమె ఫ్యాన్స్ స్పందించారు. ఇక లిండ్సే వాన్ ఎవరిని డేటింగ్ కు పిలిచిందో చెప్పలేదు కానీ, ఇంతగా స్పందించిన తన ఫ్యాన్స్ కు మాత్రం థ్యాంక్స్ చెప్పింది. కాగా, ఈ క్రీడాకారిణి ప్రముఖ గోల్ఫర్ టైగర్ వుడ్స్ తో గతంలో రెండేళ్లు డేటింగ్ చేసి, 2015లో అతన్నుంచి దూరం జరిగింది.