selfie: పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకోబోయిన యువకుడు.. కుమ్మేసిన బంధువులు!

  • ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని బార్రా ప్రాంతంలో ఘటన
  • పెళ్లి పందిరిలో అలజడి
  • పోలీసులకు బంధువుల ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లోని బార్రా ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పచ్చని పందిరిలో బంధుమిత్రులందరి మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఓ జంట పెళ్లి చేసుకుంది. అనంతరం స్టేజిపై ఉన్న కొత్త జంటకి బంధుమిత్రులు శుభాకాంక్షలు చెబుతూ గిఫ్ట్‌లు ఇస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఓ వ్యక్తి.. పెళ్లి కూతురితో సెల్ఫీ తీసుకోబోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన పెళ్లి కూతురి బంధువులు ఆ వ్యక్తిపై దాడికి దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాకు చిక్కాయి. ఈ వ్యక్తి ఎవరన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పెళ్లికూతురి బంధువుల నుంచి పోలీసులు ఫిర్యాదు అందుకున్నారు.

More Telugu News