varun tej: మొదటి నాలుగు రోజుల్లో 'తొలిప్రేమ' వసూళ్లు

  • యూత్ ను ఆకట్టుకున్న 'తొలిప్రేమ'
  • నాలుగు రోజుల్లోనే లాభాల బాటలో 
  • ప్రపంచవ్యాప్తంగా 25.8 కోట్ల గ్రాస్

వరుణ్ తేజ్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'తొలిప్రేమ' సినిమా తెరకెక్కింది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలిరోజునే ఈ సినిమా అన్ని ప్రాంతాల నుంచి సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

యూత్ కి కంటెంట్ కనెక్ట్ అయిన కారణంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా 10.77కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 25.8 కోట్ల గ్రాస్ ను .. 14.6 కోట్ల షేర్ ను సాధించింది. ఇప్పటికే అన్ని ఏరియాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి 'ఫిదా' తరువాత వరుణ్ తేజ్ మరో హిట్ కొట్టేశాడన్న మాట.         

More Telugu News