priya prakash: మరోసారి హావభావాలు ఒలకబోసిన ప్రియా ప్రకాశ్.. ఈ సారి లవ్ తుపాకీ.. నెటిజన్లు ఫిదా

  • 'ఒరు అదార్ లవ్' మూవీలో ఆమె కనబరిచిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా
  • మొన్న కన్నుగీటుతూ అందరినీ తనవైపునకు తిప్పుకున్న అమ్మాయి
  • ఇప్పుడు మరో వీడియో

మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన 'ఒరు అదార్ లవ్' మూవీలోని ఓ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా అందులో ఆమె కనబరిచిన ఎక్స్‌ప్రెషన్స్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతోన్న విషయం తెలిసిందే. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సినిమాలోని మరో వీడియోను విడుదల చేశారు. మొన్న కన్నుగీటుతూ అందరినీ తనవైపునకు తిప్పుకున్న ఈ కుట్టి ఇప్పుడు లవ్ తుపాకీ పేల్చుతున్నట్లు పోజు ఇచ్చి అదరగొట్టేస్తోంది.

ప్రియా హావభావాలు మరోసారి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త టీజర్‌లో ఆమె తన రెండు వేళ్లను గన్‌గా చూపిస్తూ దానిలో ముద్దుని లోడ్ చేసి తన ప్రియుడి వైపు గురి పెట్టి పేల్చింది. దీంతో ఆ యువకుడు ఆ ముద్దు తన గుండెల్లో దిగిపోయినట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. మీరూ చూండి...  

More Telugu News