shivajiraja: అమెరికాలో 'మా' సిల్వర్ జూబ్లీ వేడుకలు .. ముఖ్య అతిథులుగా చిరంజీవి, మహేశ్ బాబు!

  • మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలు 
  • తొలివేదికగా అమెరికాలోని డల్లాస్
  • 35 మంది పేద కళాకారులకు ఈ నెల నుంచి పింఛను  

'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'మా' అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అమెరికాలో సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి గారిని ఆహ్వానించామనీ .. ఏప్రిల్ 28వ తేదీన 'డల్లాస్'లో జరిగే తొలి రోజు వేడుకకి రావడానికి ఆయన అంగీకరించారని అన్నారు. మేలో జరగనున్న వేడుకకి మహేశ్ బాబు వస్తానన్నారని చెప్పారు. సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఈ నెల నుంచి 35 మంది పేద కళాకారులకు 3వేల చొప్పున పింఛను అందించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. నటీనటులంతా కూడా 'మా'లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 'మా' ప్రధాన కార్యదర్శి నరేశ్ .. కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ .. కార్యవర్గ సభ్యుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.    

More Telugu News